
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ఫాంటసీ చిత్రం విశ్వంభరపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఫాంటసీ అంశాలు, చిరంజీవి పాత్రపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.
విశ్వంభర సినిమాను సంక్రాంతి సీజన్‌లో విడుదల చేస్తారా లేదా ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనే విషయంపై దసరా సమయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తాజా సమాచారం. అయితే రిలీజ్ డేట్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. దీంతో మెగా అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!