

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’పై ప్రశంసలు కురిపించారు. సినిమాలోని విజువల్స్, గ్రాండ్ మేకింగ్, నటీనటుల అభినయాన్ని కొనియాడారు. ముఖ్యంగా రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్, సీతగా సాయి పల్లవి తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారని ప్రశంసించారు. రణ్‌బీర్ వనవాస సన్నివేశాల్లో ఎంతో ప్రశాంతంగా నటించారని, యశ్ రావణుడిగా శక్తిమంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారని పేర్కొన్నారు. సాయి పల్లవి హుందాతనంతో ఆకట్టుకున్నారని, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు తనకు బాగా నచ్చాయని తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
ఇక సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నట్లు సమాచారం. భారీ విజువల్స్, సెట్స్, యుద్ధ సన్నివేశాలతో పాటు జటాయువు ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆకట్టుకుంటున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ చిత్రంలోనూ రామాయణ ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని తెలుస్తోంది. ఇందులో మహేశ్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, నిడివిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!