

విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ సినిమా కోలీవుడ్‌కు మరో అరుదైన గుర్తింపు తీసుకొచ్చింది. 2024లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను హాలీవుడ్‌లో అధికారికంగా రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. తమిళ సినిమాకు చెందిన ఓ ప్రముఖ బ్లాక్‌బస్టర్ చిత్రానికి హాలీవుడ్ రీమేక్ రూపొందడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇండియాతో పాటు చైనా మార్కెట్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. చైనాలో సుమారు రూ.91.65 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది.
ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ ఈ హాలీవుడ్ రీమేక్‌ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించగా, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. హాలీవుడ్ స్టార్ మాథ్యూ మెక్‌కోనాగీ ఈ రీమేక్‌లో నటిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ‘మహారాజ’లో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో, అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. ఇంట్లోని డస్ట్ బిన్ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లే క్షౌరకుడి కథగా మొదలయ్యే ఈ సినిమా, ఆ తర్వాత ఊహించని మలుపులతో కూడిన ప్రతీకార కథగా మారుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!