

దర్శకుడు సాయి రాజేశ్ మరో ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రంతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘మైనా’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, మిట్టీ అండ్ మూన్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శివమణి పట్నంశెట్టి, గీతా మహావది, చంటి బాబు, దివ్య జయరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహి ఇప్పలపెల్లి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. చంటి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.
సంబంధాల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించేందుకు ప్రయత్నించే రెండు జంటల ప్రయాణం నేపథ్యంలో ఈ రొమాంటిక్ డ్రామాను రూపొందిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ద్వారా కథాంశంపై ఆసక్తిని పెంచారు. సాయి రాజేశ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గోవిందరావు పి. సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, సంతోష్ నాయుడు ఎడిటింగ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!