

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయనతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నటుడు, నిర్మాత సంజయ్ దత్ భావోద్వేగానికి గురయ్యారు. గుప్తా కలను నెరవేరుస్తానని, ఆయన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘కాంటే 2’ చిత్రాన్ని తప్పకుండా రూపొందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గుప్తాతో కలిసి దిగిన పాత ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సంజయ్ దత్.. తన స్నేహితుడిని కోల్పోయిన బాధను వ్యక్తం చేస్తూ భావోద్వేగపూరితమైన నోట్ రాశారు.
‘‘గుప్తా.. నువ్వు లేవన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎన్నో ఏళ్ల స్నేహం మనది. మనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నువ్వు ఎప్పటికీ నా కుటుంబంలో ఒకడివే. ఇటీవలే ‘కాంటే 2’ గురించి మాట్లాడుకున్నాం. నీ కలను నెరవేరుస్తా. ఈ సినిమా కోసం చేయాల్సిన కృషి అంతా చేస్తా. నువ్వు లేని జీవితం మునుపటిలా ఉండదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా బ్రదర్’’ అని సంజయ్ దత్ పేర్కొన్నారు. కాగా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలో సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ‘కాంటే’ చిత్రం 2002లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, సునీల్ శెట్టి, కుమార్ గౌరవ్, లక్కీ అలీ, మహేశ్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!