

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తన జీవిత ప్రయాణం, మధ్యతరగతి నేపథ్యం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తాజా చిత్రం రణబాలి ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడుతూ, సినీ రంగంలో విజయం సాధించిన తర్వాత తన జీవనశైలి మారినా, ఆలోచనా విధానం మాత్రం పెద్దగా మారలేదని తెలిపారు. గతంలో బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన కార్లలో వెళ్లేవారిని చూసి, వారు తమ సంపాదనతో కార్లు కొనుక్కున్నారా లేదా వారి తల్లిదండ్రులు కొనిచ్చారా అని ఆలోచించేవాడినని గుర్తుచేసుకున్నారు. కారులో ప్రయాణించడం ఎంత సౌకర్యంగా ఉంటుందోనని అప్పట్లో ఊహించుకునేవాడినని చెప్పారు.
ఇప్పుడు కారులో ప్రయాణిస్తూ బస్సుల్లోని వారిని చూసినప్పుడు తన పాత రోజులు గుర్తుకొస్తాయని విజయ్ తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండవచ్చోనని తాను ఆలోచిస్తుంటానని చెప్పారు. ఆర్థిక స్థితి, హోదా పెరిగినప్పటికీ గత అనుభవాలు మనిషిని తన మూలాలను గుర్తుచేస్తాయని ఆయన వ్యాఖ్యల సారాంశం. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. విజయాన్ని ఆస్వాదిస్తూనే తన గతాన్ని గుర్తుంచుకోవాలనే సందేశం ఆయన మాటల్లో కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!