

హీరో వరుణ్ సందేశ్ కొత్తగా “నా వైఫ్ మిస్సింగ్” అనే విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ప్రేమకథతో పాటు సైకాలజికల్ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ దర్శకురాలు స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఆహా సమర్పణలో కొమర మీడియా వర్క్స్ నిర్మాణంలో శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కథలో భార్య అదృశ్యం చుట్టూ జరిగే మిస్టరీ సంఘటనలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనుండగా ప్రవీణ్, మోహిత్, సత్య శ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా సతీష్ కుమార్ ఎన్ఎస్ సినిమాటోగ్రఫీ, సాయి బాబు తలారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథను ఉమర్జీ అనురాధ సిద్ధం చేయగా శ్రీనివాస్ మండల స్క్రీన్ప్లే అందించారు. థ్రిల్లర్ జానర్ అభిమానులకు ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం భావిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!