

న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. ప్రపంచం కీలక మార్పులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుందని ఆయన అన్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు ఒకే వేదికపైకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బహుళపక్ష సంస్థలను బలోపేతం చేయడం, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడం, ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని స్వాగతించారు.
విభిన్న అభిప్రాయాలు కలిగిన దేశాలు నిర్మాణాత్మకంగా చర్చించుకుని ఏకాభిప్రాయానికి చేరుకునేందుకు భారత్ విశ్వసనీయ వేదికగా ఎదిగిందని చంద్రబాబు అన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం భారత్ పెరుగుతున్న ఆర్థిక శక్తి, అంతర్జాతీయ ప్రాధాన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, కీలకమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్ గొంతు గతంలో ఎన్నడూ లేనంతగా విశ్వాసం, గౌరవంతో వినిపిస్తోందని అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!