

బిగ్‌బాస్ తెలుగు 10లో తొలి వారం పలు అనూహ్య పరిణామాలతో ముగిసింది. సాధారణ సీజన్లకు భిన్నంగా మొదటి వారంలోనే చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్ ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. వారాంతపు ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షిస్తూ పలువురి ప్రవర్తనపై సూచనలు చేశారు. రోహిత్, శాలినీ, సృష్టి ఎక్కువగా ఆంగ్లంలో మాట్లాడటాన్ని గుర్తించిన ఆయన.. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెలుగులో మాట్లాడాలని సూచించారు.
అనంతరం ‘హార్ట్‌కు ఎవరు దగ్గర? ఎవరు దూరం?’ అనే ఆట కొనసాగింది. పలువురు కంటెస్టెంట్లు దేబ్జానీని తమ హార్ట్‌కు దగ్గరగా పేర్కొనగా, రోహిత్‌ను కొందరు దూరంగా ఉంచారు. దేబ్జానీ ఎక్కువ మంది కంటెస్టెంట్లకు దగ్గరగా ఉండటాన్ని నాగార్జున అభినందించారు. మరోవైపు అమన్, ముకేశ్‌లను హౌస్‌మేట్స్‌గా ప్రకటించారు. ‘బ్లాక్ కీ’ పవర్ టాస్క్‌లో సృష్టికి పవర్ బాక్స్ దక్కగా, మరో పోటీలో విజయం సాధించిన సుధీర్‌కు ఆ పవర్ బాక్స్ బదిలీ అయింది. అనంతరం సృష్టి, నరేష్‌లను కూడా హౌస్‌మేట్స్‌గా ప్రకటించారు.
ఎపిసోడ్ చివర్లో వర్షిణి, సుధీర్, కృష్ణుడిని యాక్టివిటీ రూమ్‌కు పిలవడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే చివరికి ముగ్గురినీ హౌస్‌మేట్స్‌గా ప్రకటించి బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో తొలి వారం ముగిసే సమయానికి ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లందరూ హౌస్‌మేట్స్‌గా మారారు. దశావతారం కాన్సెప్ట్‌లో భాగంగా తొలి వారానికి సంబంధించిన ‘మహాపరిక్ష’ పూర్తయిందని నాగార్జున ప్రకటించగా.. రెండో వారంలో ‘పవర్ ఆఫ్ పీపుల్’ అనే కొత్త దశ ప్రారంభం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!