

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. సినిమా విడుదల కోసం మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే సినిమా యాక్షన్ పార్ట్ గురించి నిర్మాత ఎస్‌ఎస్ కార్తికేయ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రమోషన్స్‌లో ఆయన ‘వారణాసి’ గురించి మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఈ సినిమాను ఒక్క మాటలో చెప్పాలంటే ‘అగ్నిపర్వతం’ అని అభివర్ణించారు. అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందితే దాని ప్రభావాన్ని ఊహించడం కష్టమన్నట్లుగా, ‘వారణాసి’ కూడా భారీ స్థాయిలో ప్రభావం చూపే సామర్థ్యం కలిగిన చిత్రమని ఈ వ్యాఖ్యల ద్వారా అభిమానులు అంచనా వేస్తున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్‌లో సినిమాపై మరింత హైప్ పెరిగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!