

సందిగ్ధం సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, నవీన్ రాజ్ సంకరపు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పార్థసారధికొమ్మోజు దర్శకత్వం వహించారు. తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే పోస్టర్లు, టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చిత్రబృందం ప్రమోషన్స్‌ను కూడా ప్రారంభించింది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 29న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ రవి రామ్ సంగీతం అందించగా, నందన్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. విశ్వన్ రాజ్ డిఎస్ ఎడిటర్‌గా పనిచేశారు. జీవా కొచెర్ల, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!