

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తొలుత దీపికా పదుకొణెను హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పటికీ తర్వాత త్రిప్తి దిమ్రిని ఫైనల్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగింది. షూటింగ్ వేగంగా జరుగుతుండగా అభిమానులు అధికారిక అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఓ ఇంటర్వ్యూలో త్రిప్తి దిమ్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన అనుభవమని తెలిపారు. ప్రస్తుతం మరిన్ని వివరాలు చెప్పడం తొందరపాటు అవుతుందని, సరైన సమయంలో మేకర్స్ వెల్లడిస్తారని చెప్పారు. థియేటర్లలో ఇది గొప్ప విజువల్ అనుభవంగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘యానిమల్’ తర్వాత మరోసారి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!