
రాజకీయాలు

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్’ చిత్రానికి రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అవ్వల్ దావత్’ పాట ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.

ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ భారీ స్థాయిలో విడుదల చేయనుంది. సినిమా కథ, కంటెంట్ నచ్చడంతో స్పిరిట్ మీడియా పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు స్నేహితుల జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని చిత్రబృందం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!