Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్

Writer: Harika S 03:33 PM, 1 జులై, 2026
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్

అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయి ‘రూల్ ఆఫ్ ఫియర్’ నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అవినీతి, దుర్మార్గ పాలనను ప్రశ్నించకుండా ఉండేందుకు చట్టాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారని ఆరోపించారు.

వైఎస్ జగన్ ప్రధాన వ్యాఖ్యలు: “రెండేళ్ల క్రితం ఏపీ అంటే సంక్షేమం, అభివృద్ధికి మారుపేరు. కానీ నేడు రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, మోసాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.”

విజయవాడలో సాయికృష్ణ కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య, కర్నూలులో దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్, తెనాలిలో తిరుపతమ్మ, శ్రీకాకుళంలో కళావతి ఘటనలు రాష్ట్రంలో చంద్రబాబు నడుపుతున్న ‘జంగిల్ రాజ్’కు అద్దం పడుతున్నాయి.

విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని కొట్టి చంపి, కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వకుండా శవాన్ని మాయం చేయడం అత్యంత పాశవికమని ఆయన ఆరోపించారు. ఈ కేసులో కమిషనర్‌ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. కేవలం టాపిక్‌ను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు తన పార్ట్‌నర్‌తో కలిసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో, కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపుల తట్టుకోలేక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు పేరపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం విజయవాడలో పర్యటించనున్నారు.

​

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

ట్యాగ్లు
వైఎస్ జగన్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుశాంతిభద్రతలుఏపీ వార్తలువిజయవాడబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల
సినిమాలు

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర
జనరల్

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్
జనరల్

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల
జనరల్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల

సమంతపై కొత్త చర్చ
సినిమాలు

సమంతపై కొత్త చర్చ

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు
క్రీడలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ
జనరల్

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర
జనరల్

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్
సినిమాలు

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం
జనరల్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!