

యాష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన స్పై థ్రిల్లర్ 'ఆల్ఫా' భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచే ఆరంభాన్ని నమోదు చేసింది. శివ్ రవైల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించగా, శర్వరి, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించారు. విడుదలకు ముందు మంచి హైప్ ఉన్నప్పటికీ, ఆ స్థాయి స్పందన మాత్రం ప్రేక్షకుల నుంచి రాలేదు.
చిత్రబృందం విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం, తొలి రెండు రోజుల్లో ఈ సినిమా భారతదేశవ్యాప్తంగా రూ.21 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ, ప్రతికూల స్పందన రావడంతో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరగడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌కు ఇది మరో ఎదురుదెబ్బగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!