

సినిమాతో పాటు అందులో కలిసి పనిచేసే వ్యక్తులు కూడా ఎంతో ముఖ్యమని కథానాయిక మాలవికా మోహనన్ అన్నారు. దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇటీవల ‘సర్దార్ 2’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ‘పాకెట్ నోవెల్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రయాణం గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రత్యేక పోస్ట్ చేశారు.
కొన్ని సినిమాలు తెరకెక్కుతున్న సమయంలో అవే ఒక చిన్న ప్రపంచంగా మారిపోతాయని, ‘పాకెట్ నోవెల్’ కూడా అలాంటి అనుభవమేనని మాలవికా పేర్కొన్నారు. సినిమాలో నటించడంతో పాటు ఎవరితో కలిసి పనిచేస్తున్నామన్నది కూడా ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు. ఒక బృందంతో నెలల తరబడి కలిసి పనిచేస్తూ, ఎన్నో అనుభవాలను పంచుకుంటే వారు తెలియకుండానే మరో కుటుంబంలా మారిపోతారని చెప్పారు. అద్భుతమైన నటుడు విజయ్ సేతుపతితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని, ఈ ప్రయాణాన్ని మరెవరితోనూ ఊహించుకోలేనని మాలవికా మోహనన్ పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!