

‘ది ప్యారడైజ్’ సినిమాపై హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అంజనా అంజనీ’ పాట చాలా అందంగా ఉందని, ఇతర పాటల కంటే ముందే తన కారులో, ఫోన్‌లో ఈ పాటను లూప్‌లో ప్లే చేసేవాడినని తెలిపారు. సినిమా ఆలస్యమైతే కెరీర్‌పై ప్రభావం పడుతుందనే అభిప్రాయాన్ని నాని ఖండించారు. సినిమా ఆలస్యం కావడం వల్ల కాకుండా, నాణ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించలేకపోతేనే కెరీర్‌పై ప్రభావం పడుతుందని అన్నారు. ‘పుష్ప’ ఆలస్యమైనప్పటికీ సుకుమార్ కెరీర్‌పై దాని ప్రభావం పడలేదని ఉదాహరణగా చెప్పారు.
‘ది ప్యారడైజ్’ 1984–85 కాలం నాటి పక్కా కమర్షియల్ సినిమాగా ఉంటుందని నాని తెలిపారు. అయితే ఇందులో ప్రపంచ నిర్మాణం చాలా సహజంగా, సినిమాటిక్‌గా ఉంటుందని చెప్పారు. సినిమా చూస్తున్న సమయంలో బయట ప్రపంచాన్ని మరిచిపోయి, తాము సృష్టించిన ‘ప్యారడైజ్’ ప్రపంచంలోకి ప్రేక్షకులు పూర్తిగా వెళ్లిపోయేలా చిత్రం ఉంటుందని నాని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!