

నేచురల్ స్టార్ నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ విడుదలకు మరికొద్ది గంటలే ఉన్నాయి. నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజ్‌కు ముందే భారీ స్పందన లభిస్తోంది. ప్రీ బుకింగ్స్‌లోనూ సినిమా దూసుకెళ్తోంది. బుక్‌మైషోలో కేవలం 24 గంటల్లోనే 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో నాని కెరీర్‌లోనే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బుకింగ్స్‌లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు ఓవర్సీస్ ప్రీమియర్స్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. సినిమా కంటెంట్‌లో ఫస్టాఫ్ ముందుగానే లాక్ చేసి క్యూబ్‌లో లోడ్ చేయగా.. వీఎఫ్‌ఎక్స్, ఇతర బ్యాలెన్స్ పనుల కారణంగా సెకండాఫ్ కంటెంట్ కొంత ఆలస్యమైనట్లు సమాచారం. తాజాగా సెకండాఫ్ కంటెంట్ కూడా ఓవర్సీస్ మార్కెట్‌కు డెలివరీ అయినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 23 సాయంత్రం ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఓవర్సీస్ థియేటర్ల జాబితాను ప్రత్యంగిర సినిమాస్ అధికారికంగా వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!