

చురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తర్వాత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వారాంతం, సెలవుల ప్రభావంతో వసూళ్లకు ఊతం లభించగా.. ఇప్పటివరకు సినిమా ప్రయాణం సంతృప్తికరంగానే సాగింది.
అయితే సోమవారం నుంచి ప్రారంభమయ్యే పని దినాల్లో ‘ది ప్యారడైజ్’ వసూళ్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. వీక్‌డేస్‌లోనూ థియేటర్ల ఆక్యుపెన్సీని నిలబెట్టుకుని స్థిరమైన కలెక్షన్లు సాధిస్తే సినిమా లాభాల దిశగా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల ట్రీట్‌మెంట్, అనిరుద్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం తదుపరి రోజుల్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందన్న దానిపైనే ఇప్పుడు దృష్టి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!