

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు తీవ్ర ఉత్కంఠ, రక్తసిక్త యాక్షన్‌తో నిండిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. జడల్ పాత్రలో నాని పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపిస్తూ శక్తివంతమైన నటనను ప్రదర్శించనున్న సంకేతాలు ఇచ్చాడు. తన జాతి కోసం పోరాడే నాయకుడిగా ఆయన పాత్రను మలిచిన తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్‌లో కనిపించిన విజువల్స్, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ పాత్రలు కూడా కథలో కీలకంగా ఉండనున్నట్లు టీజర్ స్పష్టం చేసింది. ముఖ్యంగా నాని చెప్పిన సంభాషణలు అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తుండగా, చివర్లో మనుషులను సింహాసనంగా మార్చి కూర్చున్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి ఫ్రేమ్‌కు మరింత బలం చేకూర్చింది. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆగస్టు 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై టీజర్‌తోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!