
జనరల్

యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఆమె నటించిన ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతోనే మీకు పెద్ద గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నారా? అనే ప్రశ్న ఎదురైంది.
దానికి స్పందించిన ఐశ్వర్య రాజేష్, తాను ఇప్పటివరకు దాదాపు 35 సినిమాల్లో నటించానని తెలిపారు. అయితే ఆ సినిమాల ద్వారా రాని క్రేజ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వచ్చిందని చెప్పారు. ఆ సినిమాలో తన పాత్ర ప్రతి వయసు ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని, అది తన కెరీర్‌లో ప్రత్యేకమైన పాత్రగా నిలిచిపోతుందని తెలిపారు. ఇక ఆమె త్వరలో ‘ఓ..! సుకుమారి’ సినిమాతో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!