

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శ్వాసనాళానికి సంబంధించిన శస్త్రచికిత్స అనంతరం క్రమంగా కోలుకుంటున్నారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో తన నివాసానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సమయంలో పవన్ ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం పాలన సంబంధిత పనులను కూడా తిరిగి ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే పత్రికా సమావేశాలు, క్షేత్ర పర్యటనల్లో పాల్గొనే అవకాశముందని ఉపముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తారా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలై రెండు నెలలు గడిచినా తదుపరి చిత్రాలపై నిర్ణయం వెలువడలేదు. దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి అంగీకరించినప్పటికీ పూర్తి కథ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. మరోవైపు దర్శకుడు సుజిత్ ‘ఓజి 2’ పనుల్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వాలని రాజకీయ నాయకులు, సన్నిహితులు పవన్‌కు సూచిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!