

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమిత బైజు కీలక పాత్రలో నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
అంతేకాకుండా, ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా ప్రధాన భాగం పూర్తైనట్లు తెలుస్తోంది. మిగిలిన పనులను త్వరలో ముగించి, అనంతరం భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వరుస అపజయాల తర్వాత ‘వీరభద్రుడు’ సినిమాతో విజయాన్ని అందుకున్న సూర్య, ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!