
జనరల్

మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్ గ్రామంలో ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి చెందిన గెస్ట్‌హౌస్ కాంపౌండ్ వాల్‌ను గ్రామస్తులు కూల్చివేశారు. తమ పొలాలకు వెళ్లే రహదారిని ఆక్రమించి గెస్ట్‌హౌస్ నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగినట్లు గ్రామస్తులు తెలిపారు.
కాంపౌండ్ వాల్ కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!