
జనరల్

మూసీ రివర్ ప్రాజెక్టు కోసం మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను వెంటనే ఖాళీ చేయాలని రాజేంద్రనగర్ ఆర్డీవో అధికారులు నివాసితులకు నోటీసులు జారీ చేశారు. అయితే, అపార్ట్‌మెంట్‌ను తొలగించకుండానే మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఖాళీ చేయాలని నోటీసులు ఎందుకు ఇస్తున్నారని అపార్ట్‌మెంట్ ఓనర్లు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, దానిపై స్పష్టత వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ నివాసితులు ఎమ్మార్వోకు లీగల్ నోటీసులు పంపారు. పరిహారంపై స్పష్టత వచ్చే వరకు అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. పరిహారంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని ఆర్డీవో చెప్పడంతో నివాసితులు కోర్టును ఆశ్రయించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!