
జనరల్

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు నేడు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు సుమారు 5 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీగా తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని 6 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం తీసుకొచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా మరో క్యూ లైన్‌ను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని నియంత్రిస్తూ సజావుగా దర్శనం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!