
జనరల్

తిరుపతిలో నిర్వహిస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2026ను రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశంలో సుమారు 13,500 మంది డెవలపర్లు ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని పేర్కొన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఈ రంగం అభివృద్ధి చెందితే పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకొచ్చిందని తెలిపారు. ఇలాంటి ఎక్స్పోలు నిర్వహించడం వల్ల ప్రజలకు ప్రాపర్టీ కొనుగోళ్లు, బ్యాంకులు అందించే రుణాలు, వడ్డీ రేట్లపై అవగాహన కలుగుతుందని అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!