

తమిళ నటుడు సూర్య నేరుగా తెలుగులో నటించిన తొలి చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.

విడుదలైన తొలి రోజు నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలంగాణలో ముఖ్యంగా బలమైన వసూళ్లు సాధిస్తోంది. చిత్రబృందం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, తొలి వారంలోనే తెలంగాణలో రూ.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో తెలంగాణలో తొలి వారంలో రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన రెండో తమిళ హీరోగా సూర్య నిలిచినట్లు మేకర్స్ తెలిపారు. సినిమాకు వస్తున్న స్పందనతో రెండో వారంలోనూ మంచి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!