

దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి. బాపిరాజు నిర్మించిన చిత్రం కాక్రోచ్ సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. చిత్రంలోని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సున్నిత మనస్కులు మరియు పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శక, నిర్మాతలు పత్రికాముఖంగా సవినయంగా విజ్ఞప్తి చేశారు. మార్చి మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వారు తెలిపారు.
అవినీతి సమాజపు చీకటి కోణాలను ఆవిష్కరిస్తూనే, అడ్డురోడ్లో జీవనం సాగించే వేశ్యకు మరియు కిరాయి హంతకుడికి మధ్య ఏర్పడే స్వచ్ఛమైన స్నేహాన్ని కాక్రోచ్ కథగా మలిచింది. హింసాత్మక సన్నివేశాలను సహజంగా చూపించేందుకు నిజజీవిత ఫైటర్లను నటులుగా ఎంపిక చేశారు. అభిలాష్ సుంకర, ప్రేంసన్, నవీన్లు కిరాయి హంతకుల పాత్రల్లో నటించగా, జాతీయ అవార్డు గ్రహీత తీర్థ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేష్, మల్లిక, ఎఫ్ ఎమ్ బాబాయ్, రాజు, బాలాజీ, ఎల్ బీ రమణ, ఆర్ కే సింగ్, పూజా, పొట్టి మూర్తి, ప్రసాద్, రేలారే రఘు బృందం, జానీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. చిత్రానికి సంగీతం ప్రదీప్ చంద్ర, ఎడిటింగ్ రఘు, సినిమాటోగ్రఫీ సంతోష్, లిరిక్స్ ప్రతాప్, సౌండ్ నాగరాజు, ఫైట్ మాస్టర్ ప్రేంసన్.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!