
జనరల్

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘మండాడి’ చిత్రంలో తమిళ నటుడు సూరి మరియు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు మతిమారన్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై ఆసక్తిని పెంచాయి.
తాజాగా చిత్రబృందం సుహాస్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆయన శక్తివంతమైన “సాట్టపులి” పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తీరప్రాంత మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!