
రాజకీయాలు

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ‘కాకా’ సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైందని, అయితే కారులో ఉన్న తమకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదం జరిగినప్పటికీ అందరూ క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నామని పేర్కొన్నారు.
ఈ ప్రమాదం నుంచి అయ్యప్ప స్వామి కాపాడారని శేఖర్ మాస్టర్ భావోద్వేగంగా స్పందించారు. ‘ఇరుముడి’ సినిమాలోని పాటకు కూడా తానే కొరియోగ్రఫీ అందించినట్లు గుర్తుచేశారు. ప్రమాదం జరిగినా షూటింగ్‌కు విరామం ఇవ్వకుండా అదే రోజు రాత్రి మళ్లీ చిత్రీకరణకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఆయన క్షేమంగా బయటపడటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఊరట వ్యక్తం చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!