

యంగ్ హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డీఎన్‌కే (డోంగనాకోడుకు)’ విడుదలకు సిద్ధమైంది. శ్రీను కంబాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈనెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్లతో సినిమాపై ఆసక్తి పెరుగుతుండగా, తాజాగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సనా తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బుచ్చిబాబు.. నిర్మాత రవిశంకర్‌ను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు. ప్రతి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఉచితంగా హాజరవుతున్నానని, ఒక్కో ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా ఇప్పటికి కోకాపేటలో ఫ్లాట్ కొనేవాడినని చమత్కరించారు. ఇకపై తనకు పారితోషికం ఇప్పించాలని కోరుతూ నవ్వులు పూయించారు. మరోవైపు, మౌళి తనూజ్ ప్రశాంత్‌తో పాటు ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ జయకృష్ణ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. చిన్న చిత్రంగా వస్తున్న ‘డీఎన్‌కే’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!