

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తొలిసారి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘రాపో23’. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌ను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన డేట్స్ కేటాయించలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పాత్ర కోసం తమిళ నటుడు ఎస్.జే. సూర్యను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం.
అయితే ఎస్.జే. సూర్య సుమారు రూ.8 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు, ఆ మొత్తాన్ని చెల్లించడం సాధ్యం కాకపోవడంతో మేకర్స్ మరో నటుడి కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రముఖ హిందీ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో కీలక పాత్రలో రితేశ్ దేశ్‌ముఖ్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది. అయితే నటీనటుల ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!