

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మైథలాజికల్ అంశాలతో ఈ ప్రాజెక్ట్ రూపొందనుందనే సంకేతాలు ఇప్పటికే విడుదలైన ప్రకటన పోస్టర్ ద్వారా అందాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే ప్రచారం జరగగా, ఇప్పుడు దానికి తోడు ‘దేవసేనాపతి’ అనే మరో పవర్‌ఫుల్ టైటిల్‌ను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మైథలాజికల్ నేపథ్యానికి ‘దేవసేనాపతి’ అనే పేరు బలంగా సరిపోతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్–త్రివిక్రమ్ గతంలో ‘అరవింద సమేత వీర రాఘవ’తో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ ఇతర కమిట్‌మెంట్లతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ‘గాడ్ ఆఫ్ వార్’, ‘దేవసేనాపతి’లో చివరకు ఏ టైటిల్‌ను ఖరారు చేస్తారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!