

శ్రీవిష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కొత్త దర్శకుడు జానకిరామ్ మారెళ్ల తెరకెక్కించిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కామ్రేడ్’ అనే టైటిల్‌ను చూసినప్పుడు ఇది సీరియస్ పొలిటికల్ డ్రామా అయి ఉంటుందని భావించినప్పటికీ, టీజర్, ట్రైలర్ మాత్రం పూర్తి ఫన్ మోడ్‌లో ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
అయితే ఈ సినిమా కథ నక్సలిజం నేపథ్యంతో కూడిన పీరియడ్ సబ్జెక్ట్ కావడం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సున్నితమైన అంశాన్ని ప్రధానంగా తీసుకుని కామెడీని నడిపించడం దర్శకుడికి సవాల్‌గా మారే అవకాశం ఉంది. సీరియస్ బ్యాక్‌డ్రాప్‌కు, వినోదాత్మక కథనానికి మధ్య సరైన సమతుల్యతను దర్శకుడు ఎంతవరకు సాధించారన్నదే కీలకం. ఈ రెండు అంశాలను మేకర్స్ ఎలా మిళితం చేశారో, ప్రేక్షకులు సినిమాను ఎలా స్వీకరిస్తారో విడుదల తర్వాతే తేలనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!