

శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చింతా వినీష్ రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా, చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘ శ్రీ చిదంబరం ’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంతో వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఈ నెల 6 న విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ యంగ్ టీమ్ ఎంతో ఉత్సాహంతో సినిమా తీశారని, ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. తాను మొదట ప్లేబ్యాక్ సింగర్ కావాలని ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తరువాత సంగీత దర్శకుడిగా స్థిరపడ్డానని చెప్పారు. ఈ చిత్రంలో తాను పాడిన పాటను తన కుటుంబ సభ్యులు ఎంతో ఇష్టంగా వింటారని పేర్కొన్నారు. ఈ సినిమా అందరికీ మంచి విజయాన్ని అందించాలని కోరుకున్నారు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ తొలి సినిమా ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని, ఈ టీమ్ చేసిన కష్టం టీజర్ చూస్తే అర్థమవుతుందని అన్నారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ వినయ్ మరియు టీమ్‌లో ఉన్న నమ్మకం, పట్టుదల ఎంతో అభినందనీయమని చెప్పారు. దర్శకుడు వినయ్ రత్నం మరియు హీరో వంశీ తుమ్మల ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ప్రేమ కథగా రూపొందించామని, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!