
సినిమాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రంలోని పలు కీలక భాగాలను పూర్తి చేసిన చిత్రబృందం, ఇప్పుడు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో కొత్త చిత్రీకరణ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కథలో కీలక మలుపు తీసుకొచ్చే సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నట్లు సమాచారం.
ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన ప్రత్యేక శైలిలో ఈ భాగాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, భావోద్వేగాలు, కథనం సమతూకంగా ఉండేలా సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!