

దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు నాలుగో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే చిత్రబృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సెట్లో శర్వానంద్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘విశ్వం’ తర్వాత ఈసారి బలమైన కథతో విజయాన్ని అందుకోవాలని దర్శకుడు శ్రీను వైట్ల కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వినోదం, కమర్షియల్ అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!