
గాసిప్స్

‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రంలోని రెండో పాట ‘ఇంత ఇష్టమా’ నేడు మధ్యాహ్నం 12:06 గంటలకు విడుదలైంది. ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన మెలోడీగా ఈ పాటను చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. విడుదలకు ముందే ప్రచార వీడియోకు మంచి స్పందన లభించడంతో పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ పాటకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. భావోద్వేగభరితమైన స్వరాలు, ఆకట్టుకునే సంగీతంతో ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. 2026లో ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!