

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ముంబైలో స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (ఎస్ఆర్ఏ) డేటా కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ సపోర్ట్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన గతంతో పోలిస్తే చాలా సన్నగా, అలసిపోయినట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై చర్చ మొదలైంది. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో అభిమానులు "సల్మాన్‌కు ఏమైంది?", "ఆరోగ్యం బాగానే ఉందా?" అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే మరోవైపు కొందరు అభిమానులు, నెటిజన్లు సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా నిలుస్తూ సహజమైన వయసును అంగీకరించి ప్రజల ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై సల్మాన్ ఖాన్ లేదా ఆయన బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా, మాతృభూమితో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రంలో కూడా సల్మాన్ నటిస్తూ బిజీగా ఉన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!