21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న కేరింత హీరోయిన్!

Writer: Shivani K 09:40 AM, 21 ఆగస్టు, 2026
మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న కేరింత హీరోయిన్!

తెలుగులో వచ్చిన ‘కేరింత’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సుకృతి అంబటి తల్లయ్యారు. మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన బిడ్డకు సంబంధించిన ఓ ఫొటోను కూడా పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్తా వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు సుకృతికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన సుకృతి అంబటికి చిన్నప్పటి నుంచే డ్యాన్స్, నటనపై ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లోనే తన ప్రతిభను చాటుకున్న ఆమెకు దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’లో భావన పాత్రలో నటించే అవకాశం దక్కింది. సినిమా మంచి స్పందన అందుకున్నప్పటికీ ఆ తర్వాత సుకృతి మరో సినిమాలో కనిపించలేదు. నటనకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితంపైనే దృష్టి పెట్టారు.

దాదాపు నాలుగేళ్ల క్రితం అక్షయ్ సింగ్‌ను సుకృతి వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూ వచ్చిన ఆమె, ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను గర్భవతిననే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించడంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చిన సుకృతి.. ఇప్పుడు తల్లిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బిడ్డ జన్మించిన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడంతో ఆమె పోస్ట్‌కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. సుకృతికి శుభాకాంక్షలు చెబుతూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో కేరింత హీరోయిన్‌కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది -  గౌరి ప్రియ

ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది - గౌరి ప్రియ

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!

తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!

ట్యాగ్లు
సుకృతి అంబటికేరింత హీరోయిన్మగబిడ్డకు జన్మటాలీవుడ్దిల్ రాజుఅక్షయ్ సింగ్సినీ వార్తలుతెలుగు హీరోయిన్సెలబ్రిటీ మదర్సోషల్ మీడియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!
జనరల్

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...
బిజినెస్

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!
రాజకీయాలు

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు
జనరల్

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు
జనరల్

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం
జనరల్

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్
సినిమాలు

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి
సినిమాలు

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి
జనరల్

రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి

సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం...
జనరల్

సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!