
రాజకీయాలు

సోషల్ మీడియాలో జరుగుతున్న ఫొటోల మార్ఫింగ్, ట్రోలింగ్‌పై హీరో రామ్ పోతినేని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో స్పష్టమైన గుర్తింపు లేకపోవడం వల్లే కొందరు భయపడకుండా ఇతరులను దూషించడం, వేధించడం, ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని అన్నారు. ప్రతి సోషల్ మీడియా అకౌంట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసే విధానం తీసుకురావాలని రామ్ సూచించారు. దీనివల్ల వినియోగదారులు మరింత బాధ్యతగా వ్యవహరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అకౌంట్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరనేది గుర్తించే అవకాశం ఉంటే ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ బుల్లీయింగ్, నకిలీ అకౌంట్ల సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చని రామ్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వినియోగంలో జవాబుదారీతనం పెరిగితే ఇతరులను దూషించడం, వేధించడం వంటి చర్యలకు కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!