

అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభితా ధూళిపాళ తన రాజకీయ ఆలోచనలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో తనకు వామపక్ష భావజాలం ఎక్కువగా ఉందని, భవిష్యత్తులో ఏదో ఒక రోజు కమ్యూనిజం విజయం సాధిస్తుందని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. ఓ స్టార్ హీరోయిన్ తన రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
కొంతమంది శోభిత నిజాయితీని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో ఈ సిద్ధాంతాల అమలు సాధ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, సినిమాల విషయానికి వస్తే శోభిత వివాహం తర్వాత కొంత విరామం తీసుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఇటీవల విడుదలైన క్రాస్ రోడ్స్ చిత్రానికి మంచి స్పందన లభించగా, ప్రస్తుతం సిల్ బట్టా, వెట్టువం వంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!