

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు ఈ ఏడాది విజయాలు, వ్యక్తిగత ఆనందాలతో ప్రత్యేకంగా నిలిచింది. ‘ధురంధర్ 2’తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్న ఆయన.. భార్య, నటి దీపికా పదుకొణెతో కలిసి రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రముఖ లాల్‌బాగ్‌చా రాజాను రణ్‌వీర్ దర్శించుకున్నారు. గణపతి బప్పా ఆశీస్సులు తీసుకోవడంతో పాటు తన జీవితంలో లభించిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆలయానికి వచ్చినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా న్యూస్18తో మాట్లాడిన రణ్‌వీర్.. గత ఏడాది తనకు, తన కుటుంబానికి బప్పా కృపతో ఎంతో ఆనందాన్ని అందించిందని తెలిపారు. ముందున్న జీవిత ప్రయాణం సంతోషంగా సాగేందుకు బప్పా ఆశీస్సులు కోరుకుంటున్నట్లు చెప్పారు. రణ్‌వీర్ దర్శనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. కొంతకాలం తర్వాత అభిమానుల మధ్యకు వచ్చిన ఆయన వారితో సెల్ఫీలు దిగుతూ, ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. తెల్లటి దుస్తుల్లో కనిపించిన రణ్‌వీర్.. తన తదుపరి చిత్రం ‘ప్రళయ్’ కోసం సిద్ధం చేసిన లుక్‌లో ఆకట్టుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!