

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన కెరీర్ ప్రారంభంలో చేసిన బోల్డ్ పాత్రల కారణంగా, కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నిహిత సన్నివేశాల్లో నటించేందుకు తనను ఒప్పించేందుకు కొందరు దర్శకనిర్మాతలు ప్రయత్నించారని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. గతంలో నగ్న సన్నివేశాల్లో నటించినందుకు తనను సులభంగా ఒప్పించవచ్చని కొందరు భావించేవారని చెప్పారు. ఓ యాక్షన్ సన్నివేశంలో తొలుత షర్టు గుండీలు విప్పి నటించాలని, ఆ తర్వాత కేవలం లోదుస్తులతోనే నటించాలని అడిగారని రాధికా గుర్తుచేసుకున్నారు. అయితే, ఆ సన్నివేశం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించి, నటించేందుకు నిరాకరించినట్లు తెలిపారు.
ప్రస్తుతం సన్నిహిత సన్నివేశాలు చేయడానికి ముందు అవి కథలో ఎందుకు అవసరమో స్పష్టమైన కారణాన్ని దర్శకనిర్మాతలను అడుగుతున్నానని రాధికా ఆప్టే చెప్పారు. కేవలం సినిమా లేదా ప్రాజెక్ట్ విజయవంతం కావాలనే ఉద్దేశంతో నటీమణులను వారి హద్దులు దాటేలా ఒత్తిడి చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. తనను అలా అడిగిన వ్యక్తి పేరు చెబితే చాలామంది ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు. రాధికా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లస్ట్ స్టోరీస్ 3’లో నటించారు. సిద్ధాంత్ చతుర్వేది, అదితీరావ్ హైదరీ, కొంకణా సేన్ శర్మ, రాధికా మదన్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, అలీ ఫజల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!