

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మల్టీ టాలెంటెడ్ నటి శ్రుతి హాసన్ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతి.. నలభైకి చేరువవుతున్నా సింగిల్‌గా ఉండటంపై స్పందించింది. తాను వివాహ వ్యవస్థకు వ్యతిరేకం కాదని, తనకు తోడుగా ఉండే భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఒకే విధమైన ఆలోచనలు, పరిమితుల్లో ఇమిడిపోయే వ్యక్తిని కాదని, తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగానే జీవిస్తానని చెప్పింది. కొన్ని విషయాల్లో తాను సంప్రదాయాలను పాటిస్తానని, మరికొన్ని విషయాల్లో పాత పద్ధతులను అనుసరిస్తానని పేర్కొంది. అయితే అవన్నీ తనపై ఎవరూ బలవంతం చేయడం వల్ల కాకుండా, తనకు నచ్చి స్వచ్ఛందంగా పాటించేవేనని స్పష్టం చేసింది.
పెళ్లిళ్లలో జరిగే ఆర్భాటం, భారీ ఖర్చులపై కూడా శ్రుతి హాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. పెళ్లి పత్రాలు, కోట్ల రూపాయల ఖర్చులు, ఆడంబరాలను చూస్తే ఇదంతా ఎవరి కోసం చేస్తున్నామనే ఆలోచన వస్తుందని చెప్పింది. చట్టపరమైన పత్రాల బంధం కంటే ప్రతిరోజూ ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఎంచుకోవడమే నిజమైన ప్రేమ అని తాను నమ్ముతానని తెలిపింది. భారీగా ఖర్చు చేసేవారితో తనకు ఎలాంటి సమస్య లేదని, అయితే ఆ డబ్బును సేవా కార్యక్రమాలు లేదా దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడింది. గతంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్లినప్పటికీ, అప్పుడు తనకు ఎలాంటి భయం కలగలేదని గుర్తుచేసుకుంది. తల్లిగా మారాలనే కోరిక తనకు ఉందని, అందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. పిల్లలను దత్తత తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అలాగే సహజంగా కూడా తల్లిగా మారాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!