
జనరల్

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటిపై దాడి జరిగింది. కాళీఘాట్‌లో ఉన్న తన ఇంటిపై బీజేపీ మద్దతుదారులు శనివారం తెల్లవారుజామున దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఇలా జరగడం గత ఆరు నెలల్లో ఇది ఏడోసారని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. కాగా.. అంతకుముందు రాత్రి బీజేపీ, టీఎంసీ మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తర్వాత శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో బీజేపీ మద్దతుదారులు తన ఇంటిపై రాళ్లు విసిరారని, దీనికి రెండు రోజులపాటు రెక్కీ నిర్వహించారని అభిషేక్ ఆరోపించారు. తనపై అదేపనిగా దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పోలీసులు, కోర్టు జోక్యం చేసుకోవడంలేదని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!