7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

Writer: Chandrika 11:15 PM, 7 నవంబర్, 2026
ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

భారత రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్టాల్లో ఒకటైన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం తప్పేనని, ఆ నిర్ణయం పట్ల ఆమె కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేశారని వెల్లడించారు. తన ఆత్మకథ 'బిలాంగింగ్: ది జర్నీ ఆఫ్ లవ్'లో ఈ విషయాలను ప్రస్తావించినట్టు సోనియా తెలిపారు. బ్రిటన్‌కు చెందిన 'ది గార్డియన్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా గాంధీ ఈ విషయాలను వెల్లడించారు

ఎమర్జెన్సీ విషయంలో ఇందిరా గాంధీ కుమారులు రాజీవ్, సంజయ్ గాంధీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, కుటుంబంలోనూ విభేదాలు తలెత్తాయని సోనియా వివరించారు. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న నాయకురాలని, ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో ఆమె కూడా సౌకర్యంగా లేరని, ఆ నిర్ణయం ఆమెను లోలోపల ఇబ్బంది పెట్టి ఉంటుందని సోనియా అభిప్రాయపడ్డారు. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 1977 మార్చి వరకు దాదాపు 21 నెలల పాటు కొనసాగింది. ఈ సమయంలో పౌర హక్కులపై ఆంక్షలు విధించారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు. పత్రికలపై సెన్సార్‌షిప్ అమలైంది. ఈ పరిణామాలను భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా పరిగణిస్తారు.

ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయంపై ఇందిరా గాంధీ కుటుంబంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సోనియా వెల్లడించారు. తన భర్త రాజీవ్ గాంధీ ఎమర్జెన్సీ విధించకుండా, తదుపరి ఎన్నికల వరకు వేచి చూడాలని తల్లి ఇందిరకు సూచించినట్లు చెప్పారు. అయితే ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మాత్రం ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయాన్ని బలంగా సమర్థించినట్లు సోనియా వివరించారు. ప్రతిపక్షాలను అడ్డుకోవాల్సిందేనని సంజయ్ భావించారని పేర్కొన్నారు. ఒక కుటుంబ విందు సందర్భంగా కూడా ఈ అంశంపై చర్చ జరిగిందని, అప్పట్లో సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇందిరా గాంధీ నిర్ణయంపై ప్రభావం చూపాయని సోనియా తన పుస్తకంలో వివరించినట్లు 'ది గార్డియన్' పేర్కొంది.

ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాలకు సంజయ్ గాంధీ ప్రభావం కూడా ఒక కారణమని సోనియా అభిప్రాయపడ్డారు. ఆయనను అదుపులో ఉంచి ఉంటే ఎమర్జెన్సీ సమయంలో దేశానికి జరిగిన నష్టంలో చాలా వరకు నివారించగలిగేవారమని తన పుస్తకంలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీకి ఎలాంటి అధికారిక మంత్రి పదవి లేకపోయినా, ప్రభుత్వ వ్యవహారాలపై ఆయనకు గణనీయమైన ప్రభావం ఉండేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, ఢిల్లీలో మురికివాడల తొలగింపు వంటి చర్యలు తీవ్ర వివాదాలకు దారితీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..

దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు..

దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పోరాటం ఆపేది లేదు: అభిజిత్ దిప్కే

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పోరాటం ఆపేది లేదు: అభిజిత్ దిప్కే

నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌

నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌

ట్యాగ్లు
సోనియా గాంధీఇందిరా గాంధీనెహ్రుయుపీఏకాంగ్రెస్ఎమర్జెన్సీసంజయ్ గాంధీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్
రాజకీయాలు

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ
రాజకీయాలు

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ
రాజకీయాలు

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌
జనరల్

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు
జనరల్

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!
బిజినెస్

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!
జనరల్

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!
గాసిప్స్

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి
క్రీడలు

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..
రాజకీయాలు

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!