

రణబీర్ కపూర్ నటించిన 'రామాయణం' ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ రెండు చిత్రాలను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్, జటాయువు పోరాట ఘట్టాలు, రావణుడి పాత్రలో యశ్ కనిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. భారీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కొన్ని సన్నివేశాలు ప్రత్యేక ప్రశంసలు అందుకుంటున్నాయి. గతంలో 'ఆదిపురుష్' ఎదుర్కొన్న విమర్శల నేపథ్యంలో కొత్త చిత్రంలోని దృశ్యాలపై ఆసక్తి పెరిగింది.
అయితే సినిమాకు అన్ని విభాగాల్లోనూ ప్రశంసలు దక్కడం లేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. సీతారాముల మధ్య భావోద్వేగ సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో పండలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు 3 గంటలకు పైగా ఉన్న నిడివి ప్రేక్షకులకు కొంత ఇబ్బందిగా మారుతోందట. దృశ్యాల పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ కథనం మరింత ఆసక్తికరంగా ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ప్రశంసలతో పాటు కొన్ని లోపాలపై కూడా చర్చ సాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!