7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

Writer: Chandrika 10:56 PM, 7 నవంబర్, 2026
ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

సాధారణంగా పండుగల వేళ ఉద్యోగులకు స్వీట్లు, బహుమతులు ఇచ్చి యాజమాన్యాలు ఆనందం పంచుకుంటాయి. కానీ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి మాత్రం తన ఉద్యోగులకు ఊహించని కానుక అందించారు. ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా నగదు బోనస్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఆయన ఔదార్యానికి ఉద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. ఓ మహిళ బోనస్‌ అందుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సూరత్‌లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న రామ్‌స్వరూప్‌ ముండే తన వద్ద పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు ఈ బోనస్‌ అందించారు. రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లను ఓ వెండి రంగు పళ్లెంలో అందంగా పేర్చి ఒక్కొక్కరికీ ఇచ్చారు. భారీ మొత్తంలో నగదు చూసి ఉద్యోగులు తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో ముండే కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

తన చిన్నతనంలో పేదరికాన్ని అనుభవించానని, పండుగల సమయంలో కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు తనకు తెలుసని ముండే తెలిపారు. తన దుకాణంలో పనిచేసేవారిని కేవలం ఉద్యోగులుగా కాకుండా కుటుంబ సభ్యులుగానే భావిస్తానని చెప్పారు. ఏడాది పొడవునా వారు చూపించే కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావమే వ్యాపార అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు.

దీపావళి సందర్భంగా ఉద్యోగులు తమ కుటుంబాల కోసం అవసరమైన వస్తువులు కొనుక్కుని, సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఖర్చు గురించి ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఉద్యోగుల పట్ల వ్యాపారి చూపిన ఆప్యాయత, ఔదార్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్..

అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్..

తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందిన తొలి రాష్ట్రంగా కేరళం..

తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందిన తొలి రాష్ట్రంగా కేరళం..

ట్యాగ్లు
దీపావళిబోనస్గుజరాత్సూరత్లక్ష బోనస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌
జనరల్

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు
జనరల్

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!
బిజినెస్

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!
జనరల్

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!
గాసిప్స్

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి
క్రీడలు

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..
రాజకీయాలు

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..
సినిమాలు

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!
సినిమాలు

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!